: విజయవాడ, శ్రీశైలంలో కొనసాగుతున్న దసరా ఉత్సవాలు.. వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్న అమ్మవార్లు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీశైలంలో రెండోరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు భ్రమరాంబ అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మయూర వాహనంపై స్వామి, అమ్మవార్లు ఊరేగనున్నారు. అలాగే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలోనూ ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. కనకదుర్గమ్మ నేడు బాలత్రిపురసుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు క్యూకట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.