: సింహం నోట్లోంచి బయటపడ్డాడు.. చట్టానికి చిక్కాడు!


సింహం బోనులో దూకి దానినే సవాలు చేసి ప్రాణాలతో బయటపడిన ఓ వ్యక్తి చట్టానికి మాత్రం దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన ముకేశ్(35) బతుకు తెరువుకోసం నగరానికి వచ్చి ఉప్పల్ సమీపంలోని నాగోల్‌లో ఉంటున్నాడు. ఈ ఏడాది మే 22న హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు వచ్చిన ముకేశ్ సింహాల ఎన్‌క్లోజర్‌ను చూస్తూ అకస్మాత్తుగా అందులోకి దూకేశాడు. అప్పటికి ముకేశ్ పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. ముకేశ్ ఎన్‌క్లోజర్‌లోకి దూకడాన్ని గమనించిన జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సింహాల దృష్టిని వేరేవైపు మళ్లిస్తూ ముకేశ్‌ను రక్షించారు. సింహాల బోనులో దూకిన ముకేశ్‌పై పోలీసులు అటవీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్న ఆయనకు శనివారం ఎర్రమంజిల్ కోర్టు శిక్ష విధించింది. నాలుగు నెలల నాలుగు రోజుల శిక్షతోపాటు వెయ్యిరూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.

  • Loading...

More Telugu News