: నీటి గుంతలో పడి చిన్నారుల మృతి.. కుమారుల మృతిని తట్టుకోలేక కుప్పకూలిన తల్లి


ఆదిలాబాద్ జిల్లా దేవాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారులు కార్తీక్, అశోక్ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు. వారి మృతిని తట్టుకోలేని తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మృతితో దేవాపూర్‌లో విషాదం అలముకుంది. అంతవరకూ ఆడిపాడిన చిన్నారులు ఇలా ఒక్కసారిగా మృత్యువాత పడడాన్ని చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News