: కరీనా కపూర్ కి షాక్.. ఐటీ అకౌంట్ హ్యాక్ చేసి, రిటర్న్ దాఖలు చేసిన హ్యాకర్!


తన చార్టెడ్ అకౌంటెంటుకి తెలియకుండా బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ కు చెందిన ఆదాయపు పన్ను రిటర్నును దాఖలు చేసినఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... కరీనా కపూర్ కి కానీ, ఆమె నియమించుకున్న చార్టెడ్ అకౌంటెంటుకి కానీ ఏమాత్రం తెలియకుండానే ఆమెకు చెందిన ఈ ఏడాది ఐటీ రిటర్న్ దాఖలు అయింది. కరీనా పాన్‌ కార్డు నంబరు, పాస్‌ వర్డ్‌ ను వినియోగించి ఇన్‌ కం ట్యాక్స్‌ రిటర్న్‌ ను గవర్నమెంట్‌ వెబ్‌ సైట్‌ లో నమోదు చేసినట్టు గుర్తించారు. దీంతో షాక్ కు గురైన చార్టెడ్ అకౌంటెంటు చెక్ చేయగా, ఆమె ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్‌ చేసిన సంగతి గుర్తించారు. దీంతో ఆయన బీకేసీలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు హ్యాకర్ ను కనుగొనే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News