: ఎల్టీటీఈ ప్రభావిత ప్రాంతాల్లో లంక 'టాలెంట్ సెర్చ్'


ఎల్టీటీఈతో పోరు ముగిసిన సుదీర్ఘ విరామానంతరం తమిళ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో లంక క్రికెట్ బోర్డు ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఎల్టీటీఈ ప్రాబల్యం ఉన్న ఉత్తర, తూర్పు ప్రాంత్రాల నుంచి ఇప్పటివరకు లంక క్రికెట్ లో పెద్దగా ప్రాతినిధ్యం ఉండేది కాదు. ఈ పరిస్థితికి ఇక ముగింపు పలకాలని లంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఉత్తర శ్రీలంకలో ప్రముఖ పట్టణం జాఫ్నాలో వచ్చే నెలలో రెండు రోజుల పాటు శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అండర్-14, అండర్-19 విభాగాల్లో సెలక్షన్స్ కూడా నిర్వహిస్తామని లంక క్రికెట్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News