: చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్న గవర్నర్ విద్యాసాగరరావు... క్షణక్షణానికి పెరుగుతున్న ఆందోళన
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు ఆ రాష్ట్ర ఇన్ ఛార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు చెన్నై చేరుకున్నారు. ముంబై నుంచి వచ్చిన ఆయన నేరుగా అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. జయలలిత ఆరోగ్యంపై తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన నెలకొనడంతో ఆయన ఆమెను పరామర్శించారు. కాగా, ఆమెను పరామర్శించేందుకు అపోలోకు జయలలిత కేబినెట్ సహచరులు కూడా చేరుకున్నారు.