: సీఎం వద్ద ఉన్న ప్రత్యేక అభివృద్ధి నిధిని రైతు రుణమాఫీకి మళ్లించాలి: రేవంత్‌రెడ్డి


రైతులకు న్యాయం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతోందని విమర్శలు గుప్పిస్తోన్న టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి.. సీఎం వద్ద ఉన్న ప్రత్యేక అభివృద్ధి నిధిని రైతు రుణమాఫీకి మళ్లించాలని అన్నారు. ఇతర టీడీపీ నేతలతో క‌లిసి రాష్ట్ర‌ వ్యవసాయశాఖ కమిషనర్‌తో ఆయ‌న భేటీ అయిన సంద‌ర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ‌లో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక‌పోవ‌డంతో రైతులు ఎన్నో క‌ష్టాలు అనుభ‌విస్తున్నార‌ని అన్నారు. వడ్డీ వ్యాపారుల వ‌ద్ద రైతులు అప్పు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇటీవ‌ల వ్యాపారులు మోసం చేసి రైతుల‌కు న‌కిలీ విత్త‌నాల‌ను అంట‌గ‌ట్టిన అంశాన్ని ఆయ‌న వారి ముందు ఉంచారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయ‌న‌కు వినతి పత్రం అందించారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కూ మూడో విడత రుణమాఫీ చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News