: 'సెక్స్ టేపు' వివాదంలో ఇరుక్కున్న ట్రంప్


ఎవరు తీసిన గోతిలో వారే పడతారనేది అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను చూస్తే అర్థమవుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో దేశానికి తానేం చేస్తానో, చేయగలనో చెప్పకుండా ప్రత్యర్థులపై విమర్శలు చేసి క్రేజ్ సంపాదించుకున్న ట్రంప్ ను గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మెడకు చుట్టుకున్నాయి. అమెరికా మాజీ మిస్ యూనివర్స్ ఎలీషియా మచాడోను దారుణంగా అవమానించిన ట్రంప్ ను తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ లో హిల్లరీ క్లింటన్ ఘోరాతి ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గతంలో ట్రంప్ నోటిదురుసుతనంతో ఎలీషియా మచాడోపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రెండో ప్రెసిడెన్షియల్ డిబేట్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ట్రంప్...గతంలో ఎలీషియాపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా, ఆమె సెక్స్ టేప్ లో నటించిందని, ఆమె ఓ క్యారెక్టర్ లెస్ ఉమన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారం రేపారు. ఇంతలో డొనాల్డ్ ట్రంప్ 2000వ సంవత్సరంలో ప్లేబోయ్ మేగజీన్ కు చెందిన నగ్నంగా ఉన్న మోడల్స్ తో లైంగిక చేష్టలకు పాల్పడుతూ షాంపేన్ పోస్తూ కనిపించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిని సాఫ్ట్ కోర్ పోర్న్ వీడియోగా డెయిలీ మెయిల్ పేర్కొంది. ఆమె వ్యవహారాన్ని ఎద్దేవా చేసే ట్రంప్...తన సాఫ్ట్ కోర్ పోర్న్ వీడియోపై ఎలా స్పందిస్తాడో చూడాలంటూ సోషల్ మీడియాలో పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

  • Loading...

More Telugu News