: ఏ సమయంలో ఎటువంటి మాటలు మాట్లాడాలో తెలియని పిచ్చోళ్లు దేశంలో ఉన్నారు: సల్మాన్ వ్యాఖ్యలపై సలీమ్ ఖాన్ తన కొడుకు సల్మాన్ ని ఇంటికే పరిమితం చేయాలి!: శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగుతోంది. ‘యూరీ ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులే కానీ నటీనటులు కాదని, వారు భారత్ కు రావచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించిన సంగతి విదితమే. సల్మాన్ వ్యాఖ్యలపై శివసేన నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కూడా స్పందిస్తూ... సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్‌కు తన కొడుకుని ఇంటికే పరిమితం చేయాలని సూచించారు. అంతేకాదు, ఏ సమయంలో ఎటువంటి మాటలు మాట్లాడాలో కూడా తెలియని కొందరు పిచ్చోళ్లు మన దేశంలో ఎంతో మంది ఉన్నారని ఆయన సల్మాన్ ను ఉద్దేశించి మండిపడ్డారు.