: రాజకీయాల్లో నైతిక విలువలకు రోశయ్య ఓ ఉదాహరణ.. ఆయనంటే నాకు ఎంతో అభిమానం: హ‌రీశ్‌రావు


ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన, త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్, కాంగ్రెస్ నేత రోశ‌య్య‌పై తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈరోజు హైద‌రాబాద్‌లో జరిగిన మహారాజశ్రీ అగ్ర‌సేన్ ఉత్సవాల్లో పాల్గొన్న హ‌రీశ్, రోశయ్యను గుర్తు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలకు ఆయ‌న ఓ ఉదాహరణ అని ఆయ‌న అన్నారు. రోశయ్యపై తాను ఎంతో అభిమానాన్ని క‌న‌ప‌రుస్తాన‌ని ఆయ‌న చెప్పారు. కాగా, వైశ్య సంఘం త‌మ ముందు ఉంచుతున్న ప‌లు డిమాండ్లను తాను ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్లి నెర‌వేరుస్తాన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News