: నిజామాబాద్ లో వాగులో కొట్టుకుపోయిన కారు.. యువతి సహా ఐదుగురు చిన్నారుల గల్లంతు


నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం సమీపంలోని పిల్లివాగులో ఈరోజు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్ర‌వాహ ఉద్ధృతి అధికంగా ఉండ‌డంతో వాగుదాటుతున్న స‌మ‌యంలో కారు కొట్టుకుపోయింది. ప్ర‌మాదాన్ని గ్ర‌హించిన డ్రైవ‌ర్ వెంట‌నే ప‌క్క‌నే ఉన్న చెట్టుని ప‌ట్టుకొని త‌ప్పించుకోగా, అందులో ఉన్న ఓ యువతి సహా ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గ‌ల్లంత‌యిన వారంతా మెదక్ జిల్లాకు చెందిన వారుగా స‌మాచారం. చెట్టుని ప‌ట్టుకొని అలాగే ఉండిపోయిన డ్రైవ‌రుని స్థానికులు ర‌క్షించారు. గ‌ల్లంత‌యిన చిన్నారులు రెండేళ్ల‌లోపు వ‌య‌సువారే అని తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News