: నిన్న సినిమాలు...నేడు టీవీ ఛానెళ్లు... నిషేధించిన పాకిస్థాన్
భారతీయ సినిమాలను తాము ప్రదర్శించమని, ఇండియన్ సినిమాలపై నిషేధం విధిస్తున్నామని ప్రకటించిన మరుసటి రోజే, పాకిస్థాన్ మరో నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ లోని భారత్ టీవీ ఛానెళ్లపై కూడా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. పాక్ లోని భారత ఛానెళ్లపై విధించిన నిషేధం అమలు చేయడంలో ఎంఎస్‌వోలు విఫలమైతే అక్టోబర్ 15 తరువాత కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ ఎలక్ట్రానికి మీడియా రెగ్యులేటరీ అధారిటీ హెచ్చరించింది. మరోవైపు 'డాన్' పత్రిక పాకిస్తాన్ లో భారతీయ కళాకారులు పనిచేయకుండా వారిపై నిషేధం విధించాలా? వద్దా? అనే అంశంపై పోల్ నిర్వహించగా, అందులో దానికి అనుకూలంగాను, వ్యతిరేకంగాను అభిప్రాయం వ్యక్తం చేసిన వారు ఇంచుమించు సమానంగానే ఉన్నారు. భారతీయ కళాకారులపై నిషేధం విధించాలని అంటూ 3,185 మంది ఓట్లు వేయగా, వారిపై నిషేధం విధించడం సరికాదని 3,157 మంది ఓట్లు వేశారు. దీంతో 'డాన్' పత్రిక షాక్ కు గురైంది.