: నేటికి మ్యాచ్ ముగిసినట్టే...కివీస్ 85/4


కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటముగిసినట్టే. 85 పరుగుల వద్ద రోంచీ వికెట్ ను జడేజా తీసిన అనంతరం చిరుజల్లులు పలకరించాయి. దీంతో ఆటగాళ్లు ముందుగానే టీ విరామం తీసుకున్నారు. ఇంతలో జల్లుల జోరు పెరగడంతో పిచ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా కవర్స్ కప్పారు. దీంతో వెలుతురు మందగించి, స్టేడియంపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో గ్రౌండ్స్ మన్ మొత్తం స్టేడియంను కప్పేశారు. దీంతో టీ విరామం అనంతరం మ్యాచ్ ప్రారంభం కాలేదు. ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 316 పరుగుల చేయగా, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ నాలుగు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News