: 18 సంవత్సరాల అజ్ఞాతాన్ని వీడి హైదరాబాద్ కు చేరుకున్న బెల్లి లలిత సోదరుడు
గతంలో గ్యాంగ్స్టర్ నయీమ్ చేతిలో ప్రజా గాయకురాలు బెల్లి లలిత ఘోరంగా హతమైన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కుటుంబంలో మరో నలుగురు కూడా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలతో తనకి ప్రాణహాని ఉందని తలచిన బెల్లి లలిత అన్న కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇటీవలే తెలంగాణ పోలీసుల చేతిలో నయీమ్ హతమవడంతో ఆయన మళ్లీ ఈరోజు హైదరాబాద్‌లో కనిపించారు. 18 సంవత్సరాలుగా ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారు. మరికాసేపట్లో ఆయన మీడియా సమావేశంలో పలు వివరాలు తెలపనున్నారు. నయీమ్ చేస్తోన్న దారుణాలపై ఆమె ఉద్యమిస్తుండడంతో ఆమెను 1999 మే 26న నల్లగొండ జిల్లా భువనగిరిలో నయీమ్ తన ముఠాతో కలిసి ఆమెను అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే.