: సీఎం తన ఇష్టం వచ్చినట్లు చేస్తాననే తీరులో ఉన్నారు: కేసీఆర్ పై షబ్బీర్ అలీ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని ఆయన అన్నారు. సీఎం తన ఇష్టం వచ్చినట్లు చేస్తాననే తీరులో ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ వైఖరి అభ్యంతరకరమని మండిపడ్డారు. మరోవైపు వినాయక నిమజ్జనం తరువాత అసెంబ్లీ సమావేశాలు పెడతామని చెప్పిన సీఎం ఆ మాట తప్పారని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీని సీఏం నిర్లక్ష్యం చేస్తున్నారని, వైద్యం అందక రోగులకు ఏమయినా అయితే కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.