: అమేజాన్ దీపావళి సేల్స్ ప్రారంభం... రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్


ఈ నెలకో ప్రత్యేకత ఉంది. నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11వ తేదీన విజయదశమి. ఈ నెల 30న దీపావళి. సాధారణంగా ఈ రెండు పండుగలు ఒక నెలలో రావడం చాలా అరుదు. పైగా ఈ పండుగలకు కొనుగోళ్లు మిగతా అన్ని పండుగల కంటే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ కామర్స్ సైట్లు భారీ అమ్మకాల ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. అమేజాన్ డాట్ ఇన్ నేటి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను కూడా ప్రకటించింది. మోటో జీ 4, రెడ్ మీ నోట్ 3, మ్యాక్ బుక్ ప్రో, కేనన్ 1200డీ కెమెరా, మైక్రోమ్యాక్స్ ఎల్ఈడీ టీవీ తదితర ఉత్పత్తులపై తగ్గింపు డీల్స్ ను అందిస్తోంది. హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ను ఉపయోగించి కొనుగోలు చేస్తే లావాదేవీ మొత్తం రూ.6 వేలకు మించి ఉంటే యాప్ ద్వారా 15 శాతం, వెబ్ సైట్ ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. వీటికితోడు ఈ ఐదు రోజుల్లో కొనుగోలు చేసిన వారి నుంచి లక్కీ విన్నర్స్ ను ఎంపిక చేసి రూ.4 కోట్ల విలువజేసే బహుమతులను అందించనుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో అక్టోబర్ 2 నుంచి ఐదు రోజుల పాటు భారీ అమ్మకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదే సమయంలో స్నాప్ డీల్ సైతం అన్ బాక్స్ దివాళీ సేల్ పేరుతో ఇవే తేదీల్లో విక్రయాలు నిర్వహించనుంది. ఒక్కోరోజు కొన్ని విభాగాల ఉత్పత్తులపై భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.

  • Loading...

More Telugu News