: ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్తాన్ చర్యలు చేపట్టాలి: రష్యా


పాకిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై ఆ దేశం కఠిన చర్యలు చేపట్టాలని రష్యా సూచించింది. పాకిస్తాన్ - భారత్ మధ్య నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తలు పెరిగేందుకు అవకాశం ఇవ్వకుండా రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై నిర్ణయాత్మకంగా పోరాడాలన్నదే తమ విధానంగా తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రరిస్టు గ్రూపులపై కఠిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News