: టీమిండియా టాప్ ఆర్డర్ బాటలోనే న్యూజిలాండ్ టాప్ ఆర్డర్.. 21 పరుగులకే ఇద్దరు అవుట్
కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టులో 316 పరుగులకి టీమిండియా ఆలౌటయిన విషయం తెలిసిందే. మొదటి ఇన్సింగ్స్‌లో లక్ష్యఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా టాప్ ఆర్డర్ బాటలోనే సాగుతున్న రీతిలో వారి బ్యాటింగ్ కొనసాగింది. న్యూజిలాండ్ ఓపెనర్లు గుప్టిల్, లాథమ్ క్రీజులో కాలు పెట్టిన వెంటనే వెనుదిరిగారు. లాథమ్ కేవలం ఒక్క పరుగుకే మహమ్మద్ స్యామీ బౌలింగ్‌లో ఔట్ కాగా, గుప్తిల్ 13 పరుగులకు కుమార్ బౌలింగ్ ధాటికి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో నిచోల్స్ ఒక్క పరుగుతో, టైలర్ రెండు పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.