: మ‌రోసారి రెచ్చిపోయిన పాక్... అఖ్నూర్ సెక్టార్పైకి బుల్లెట్ల వర్షం


పాకిస్థాన్‌, భారత్ సరిహద్దుల్లో నెల‌కొన్న ఆందోళ‌నక‌ర ప‌రిస్థితుల‌పై ప్ర‌పంచంలోని అనేక దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోన్న‌ వేళ పాక్ మ‌రోసారి రెచ్చిపోయింది. పాక్ బ‌ల‌గాలు ఈరోజు ఉద‌యం మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాయి. జమ్ముకశ్మీర్ అఖ్నూర్‌ సెక్టార్‌లోని చప్రియల్‌, సమ్వాన్‌ ప్రాంతాల్లో నిన్న పాక్ బ‌ల‌గాలు కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈరోజు తెల్ల‌వారు జామున‌ కూడా మ‌ళ్లీ అదే ప్రాంతంలో బుల్లెట్ల వ‌ర్షం కురిపించింది పాక్‌. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి హానీ జ‌ర‌గ‌లేదని, అఖ్నూర్ సెక్టార్‌లో ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని ఆర్మీ అధికారులు మీడియాకు తెలిపారు. గడిచిన 72 గంటల్లో ఆరోసారి పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

  • Loading...

More Telugu News