: ఈడెన్ టెస్టు అప్ డేట్స్: టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించడమే లక్ష్యంగా పోరాడుతున్న సహా, జడేజా
కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ లో కొనసాగుతున్న భారత్-న్యూజిలాండ్ రెండో టెస్టులో మొదటి రోజు టీమిండియా అభిమానులను టాపార్డర్ బ్యాట్స్ మెన్ నిరాశపర్చిన విషయం తెలిసిందే. ఒత్తిడిలో ఉన్న టీమిండియా చేతిలో మరో మూడు వికెట్లున్నాయి. కాసేపటి క్రితం రెండో రోజు ఆట ప్రారంభమైంది. తక్కువ పరుగులతో ఒత్తిడిలో ఉన్న టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరును అందించడమే లక్ష్యంగా సహా, రవీంద్ర జడేజా మైదానంలో చెమటోడుస్తున్నారు. సహా 29 పరుగులతో క్రీజులో ఉండగా, జడేజా 14 పరుగులు చేశాడు. మెల్లగా రాణిస్తూ మైదానంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి ఆటలో టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు పుజారా, రహానే అర్ధసెంచరీలు నమోదు చేసి టీమిండియాను ఆదుకున్నారు. భారత స్కోరు ప్రస్తుతం 272/7 (96.1 ఓవర్లకి)గా ఉంది.