: కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ రాజీనామా?. గద్వాల జిల్లాకోసమేనట!


కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మహబూబ్‌నగర్‌లోని గద్వాలను కూడా ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గద్వాల జిల్లా కోసం తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సైతం సిద్ధపడినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేడు ఆమె లేఖ రాయనున్నట్టు సమాచారం. స్పీకర్ మధుసూదనాచారిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించాలని ఆమె యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గద్వాల జిల్లాకు తన పదవి అడ్డం వస్తున్నట్టు టీఆర్ఎస్ భావిస్తుండడంతోనే ఆమె తన పదవిని త్యాగం చేయాలని అనుకుంటున్నారని అరుణ సన్నిహితులు తెలిపారు. కాగా అరుణ గతంలోనే గద్వాల జిల్లా కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవిని వదులుకుంటానని ప్రకటించారు.

  • Loading...

More Telugu News