: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు ఈ ఉదయం 8 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. కనదుర్గమ్మను నేడు మంత్రి దేవినేని ఉమ దర్శించుకోనున్నారు. కాగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని పలు దేవాలయాలు ఈ ఉదయం నుంచే కళకళలాడాయి. ‘అమ్మ’ను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాలను సుందరంగా అలంకరించారు.