: భాగ్యనగరంలో మళ్లీ కుమ్మేసిన వర్షం.. రహదారులు జలమయం


రెండు రోజులపాటు తెరిపినిచ్చిన వరుణుడు శుక్రవారం రాత్రి మళ్లీ విజృంభించాడు. ఒక్కసారిగా కుండపోతతో హడలెత్తించాడు. ఏకధాటిగా మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, మెహదీపట్నం, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేటతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపైకి భారీగా వరదనీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News