: ఈడెన్‌లో నిరాశపరిచిన టీమిండియా బ్యాట్స్ మెన్.. పడిలేచి తొలిరోజు 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు


కోల్‌క‌తాలోని ఈడెన్‌ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో మొదటిరోజు ఆట‌ముగిసింది. భారత్‌ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది. న్యూజిలాండ్ బౌల‌ర్లు బౌల్ట్‌, హెన్రీ విజృంభించ‌డంతో భార‌త్ 46 పరుగులకే టాప్ ఆర్డ‌ర్ ఘోరంగా విఫ‌ల‌మయ్యారు. విరాట్‌ కోహ్లీ, శిఖ‌ర్‌ ధావన్, విజయ్‌ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయ‌లేక‌పోయారు. శిఖర్‌ ధావన్ ఒక ప‌రుగుకే వెనుదిర‌గగా, మురళీ విజయ్ 9 ప‌రుగులు, కెప్టెన్‌ కోహ్లి 9 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ఆ త‌రువాత క్రీజులోకొచ్చిన‌ చటేశ్వర్ పుజారా, అజింక్యా ర‌హానే అద్భుతంగా రాణించారు. ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. పూజారా 87 ప‌రుగులు, అజింక్యా రహేనే 77 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. ఈడెన్ లో రాణిస్తాడ‌నుకున్న‌ రోహిత్‌ శర్మ కూడా 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. అశ్విన్ 26 ప‌రుగులు చేసి వెనుదిరిగాడు.

  • Loading...

More Telugu News