: విద్యుత్ పై మరో వడ్డనకు సర్కారు రెడీ
ప్రజల నెత్తిన మరోసారి సర్ ఛార్జి భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో వాడిన విద్యుత్ కు గాను యూనిట్ కు రూపాయి చొప్పున వసూలు చేసుకునేందుకు అనుమతించాలని డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలకు ఈఆర్సీ పచ్చజెండా ఊపితే, 2012-13 నాలుగో త్రైమాసికానికి గాను డిస్కంలకు రూ. 1137 కోట్లు వసూలు కానున్నాయి.