: పుజారా, రహానే అవుట్...భారత్ 213/6


ఈడెన్‌ గార్డెన్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు పట్టుదల ప్రదర్శించింది. ఆరంభంలోనే వికెట్లు పడిపోయినా మిస్టర్ డిపెండబుల్స్ ఛటేశ్వర్ పూజారా (87), అజింక్యా రహేనే (77) జోడి పట్టుదలగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. సెంచరీ దిగశగా సాగుతున్న వీరి జోరుకు వేగనర్, పటేల్ బ్రేకులు వేశారు. మొదట్లో కేవలం 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన భారత జట్టును వీరిద్దరి జోడీ ఆదుకుంది. వీరిద్దరు మినహా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. టాప్ ఆర్డర్ లో ఏ ఒక్కరూ డబుల్ డిజిట్ స్కోరు చేయకపోవడం విశేషం. మురళీ విజయ్ (9), శిఖర్ ధావన్ (1) విరాట్ కోహ్లీ (9), రోహిత్ శర్మ (2) విఫలం కావడంతో భారత జట్టు 213 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. క్రీజులో అశ్విన్ (18) కు జోడీగా సాహా ఆడుతున్నాడు.

  • Loading...

More Telugu News