: నయీమ్ అకృత్యాలు దావూద్, చోటారాజన్ ను మించిపోయాయంటున్న అధికారులు
పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ అకృత్యాల గురించి సిట్ అధికారులు ప్రస్తావించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా రాజన్ చేసిన అకృత్యాలను మించి నయీమ్ చేశాడని చెబుతున్నారు. సిట్ అధికారులు మాట్లాడుతూ, ఎన్ఆర్ఐలకు నయీమ్ చుక్కలు చూపించాడని, ఈ విషయాన్ని ఐదుగురు ఎన్ఆర్ఐలు ఈ-మెయిల్స్ ద్వారా తెలిపారని చెప్పారు. నయీమ్ బాధితులు ఐదు వేల మందికి పైగా ఉంటారని, పోలీసులను ఆశ్రయించింది మాత్రం కేవలం రెండు శాతమేనని అన్నారు. నయీమ్ సెటిల్ మెంట్లు రూ.20 వేల కోట్ల పైనే ఉంటాయని అన్నారు. ఒక నేతతో సంబంధాలపై ఆడియో, వీడియోలు సిట్ సేకరించినట్లు సమాచారం. నయీమ్ కేసులో 14 మంది పోలీస్ అధికారుల పాత్ర ఉందని, ఒక మాజీ అధికారి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అన్నారు.