: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. పాకిస్థాన్ సినీన‌టులు భార‌త్‌కు రావాల‌ని పిలుపు


యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై స్పందించిన బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఈరోజు ముంబ‌యిలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ... పాకిస్థాన్ న‌టుల‌కు మ‌ద్ద‌తు తెలిపాడు. పాకిస్థాన్ సినీ న‌టులు భార‌త్‌కు రావాల‌ని పిలుపునిచ్చాడు. యూరీ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులే.. కానీ న‌టీన‌టులు కాదని సల్మాన్ అన్నాడు. పాక్ ఆర్టిస్టులు ఉగ్ర‌వాదులు కాదని పేర్కొన్నాడు. న‌టీన‌టులు, ఉగ్రవాదులు వేర్వేరు అని ఆయ‌న పేర్కొన్నాడు. స‌రైన వీసా వ‌ర్క్ ప‌ర్మిట్‌తో భార‌త్ కు రావాల‌ని పిలుపునిచ్చాడు. ఎంతో మంది పాక్ క‌ళాకారుల‌కు ఇక్క‌డ నివ‌సించ‌డానికి వాలిడ్ వీసా ఉంద‌ని ఆయ‌న అన్నాడు. ఇరు దేశాల మ‌ధ్య శాంతియుత వాతావ‌ర‌ణం ఉండాల‌ని పేర్కొన్నాడు. మరోపక్క, ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఈరోజు స్పందిస్తూ పాకిస్థాన్ నటీనటులు, టెక్నీషియన్లపై నిషేధం విధించినట్లు పేర్కొంది. స‌ద‌రు అసోసియేష‌న్ భార‌త ప్రొడ్యూస‌ర్లు పాక్ ఆర్టిస్టుల‌తో కలిసి పని చేయడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలోనే స‌ల్మాన్ ఇటువంటి వ్యాఖ్య‌లు చేశాడు.

  • Loading...

More Telugu News