: అమెరికాలో కావలి అమ్మాయి దుర్మరణం


అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలుగు యువతి ప్రియాంక చౌదరి (25) ప్రమాదవశాత్తు మృతి చెందింది. నెల్లూరు జిల్లా కావలిలోని చేవూరివారితోటకు చెందిన గోగినేని వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుల కుమార్తె ప్రియాంక చౌదరి. హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం పైచదువుల కోసం అమెరికా వెళ్లింది. వాషింగ్టన్ లో ఎంఎస్ పూర్తి చేసింది. సుమారు నెలరోజుల క్రితం లాస్ వేగాస్ లోని ఒక సంస్థలో సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం లభించింది. రోజూ మాదిరిగానే బుధవారం వాకింగ్ కు వెళ్లిన ప్రియాంక అక్కడి హిక్ లేట్ కొలనులో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లిన సందర్భంలో దురదృష్టవశాత్తు అందులో పడి చనిపోయింది. ఈ వార్త ఆమె తల్లిదండ్రులకు నిన్న ఉదయం తెలిసింది. ప్రియాంక మృతదేహం సోమవారం లోగా కావలికి చేరనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News