: భారత సైన్యం పీవోకేలో చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ ను సమర్థించిన ఆప్ఘనిస్థాన్


ఇటీవల యూరీలో జ‌రిపిన పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల దాడికి ప్ర‌తిదాడి చేస్తూ భార‌త సైనికులు నియంత్ర‌ణ రేఖ‌ను దాటి పీవోకేలో ఉగ్ర‌స్థావ‌రాల‌పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన అంశంపై ఆఫ్గానిస్థాన్ స్పందించింది. భార‌త్ తీసుకున్న చ‌ర్య‌ను స‌మ‌ర్థించింది. భార‌త‌ సైన్యం పీవోకేలో జ‌రిపిన దాడులు దేశ ర‌క్ష‌ణ‌కోస‌మేన‌ని పేర్కొంది. త‌మ దేశాన్ని తాము ర‌క్షించుకునే హ‌క్కు భార‌త్ కు ఉంద‌ని చెప్పింది. ఉగ్ర‌వాదంపై భార‌త ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరును కొనియాడింది. భార‌త్ వెంట తామూ ఉంటామ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

  • Loading...

More Telugu News