: దేశం కోసం వాళ్లందరినీ చంపడానికైనా సిద్ధమే: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్రె
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్రె సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ బానిసలు, క్రిమినల్స్ లేని ఫిలిప్పీన్సే తన లక్ష్యమని, అందుకోసం వారినందరినీ చంపడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. దావోస్ నగరంలో రోడ్రిగో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ‘నన్ను హిట్లర్ తో పోల్చడం సంతోషంగా ఉంది. దేశభక్తి విషయంలో నేను హిట్లర్ కు సోదరుడి లాంటి వాడిని. జర్మనీలో హిట్లర్.. ఫిలిప్పీన్స్ లో నేను’ అన్నారు. కాగా, రోడ్రిగో అధ్యక్ష పదవిలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. ఈ ఏడాది మేలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రభుత్వం జూన్ 30 వ తేదీ వరకు 3,100 మందిని హతమార్చింది.