: మోదీకి థ్యాంక్స్ చెప్పిన రాహుల్ గాంధీ.. రెండున్నరేళ్లలో ప్రధాని చేసిన తొలి మంచిపని ఇదేనని వ్యాఖ్య
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహించనున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ‘దియోరియా టూ ఢిల్లీ యాత్ర’ పేరిట 2,500 కిలో మీటర్ల కిసాన్ పాదయాత్రను ప్రారంభించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ మోదీపై విమర్శలు గుప్పిస్తోన్న రాహుల్.. ఈరోజు మాత్రం మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వ్యాఖ్యానించారు. తాను, తమ పార్టీ పాక్‌పై కేంద్రం తీసుకున్న చర్యకు మద్దతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘మోదీకి థ్యాంక్స్. ఎందుకంటే.. రెండున్నరేళ్ల క్రితం భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ చేసిన తొలి మంచి పని ఇదే’ అని ఆయన వ్యాఖ్యానించారు.