: రేప్ చేసి జైలుకెళ్లాడు... విడుదలై వచ్చి మళ్లీ అదే పని చేశాడు!


తప్పు చేశానన్న పశ్చాత్తాపం కించిత్తు కూడా లేదు. ఓ బాలికపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లిన బాలుడు విడుదలై వచ్చి మరోసారి అదే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్ లోని బాదౌన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల బాలికపై ఆరు నెలల క్రితం అత్యాచారం చేయడంతో జువైనల్ హోమ్ కు తరలించారు. అత్యాచారం అనంతరం బాధితురాలిని కొట్టినట్టు కూడా అతడిపై అరోపణలు వచ్చాయి. ఇటీవలే జువైనల్ హోమ్ నుంచి విడుదలైన అతడు మరోసారి అదే బాలికను వెతికి పట్టుకుని మరీ అత్యాచారం చేశాడు. అయితే, పోలీసులు అభియోగాలను మార్చినట్టు, అత్యాచారం కేసును లైంగిక వేధింపుల కేసుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. బాధితురాలు మేజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో అత్యాచారాన్ని తోసిపుచ్చిందని, బాలుడు తనను లైంగికంగా వేధించినట్టు మాత్రమే పేర్కొందని పోలీసుల వాదనగా ఉంది. అయితే, తనకు చదువు రాదని, పోలీసులు తన వేలి ముద్రలు తీసుకున్నారని, కేసు విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆమె వాపోయింది.

  • Loading...

More Telugu News