: పాక్ లో బాలీవుడ్ సినిమాల ప్రదర్శన నిలిపివేత


పాక్ ముష్కరులపై భారత సైన్యం దాడికి ప్రతిగా అక్కడ బాలీవుడ్ సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. లాహోర్ లో ప్రముఖ సినిమా థియేటర్ సంస్థ 'సూపర్ సినిమా' తన థియేటర్లు వేటిలోనూ భారతీయ సినిమాలను ప్రదర్శించడం లేదంటూ ఫేస్ బుక్ పేజీలో మెస్సేజ్ పెట్టింది. పాక్ సైనికులు, కళాకారులకు సంఘీభావంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. భారతీయ సినిమాల ప్రదర్శనపై నిషేధం నిరవధికంగా కొనసాగుతుందని పేర్కొంది. సూపన్ సినిమా అనేది పాకిస్తాన్ లో పెద్ద సినిమా ఆపరేటర్లలో ఒకటి. ఇక, భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేస్తున్నట్టు కరాచీలోని నూప్లెక్స్ సినిమా ఆపరేటర్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. సైనికులకు సంఘీభావంగా ఈ చర్య తీసుకున్నట్టు, తదుపరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పేర్కొంది.

  • Loading...

More Telugu News