: రెండు గంటల వ్యవధిలో చెన్నైలో ఇంతటి వర్షపాతం ఎప్పుడూ చూడలేదంటున్న అధికారులు
చెన్నైలో కేవలం రెండు గంటల వ్యవధిలో 65.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇరవై ఏళ్ల తర్వాత సెప్టెంబర్ నెలలో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే ప్రథమం అని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. కాగా, బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం దాకా చెన్నై నగరంలో 82.3 మిమీ వర్షపాతం నమోదైనట్టు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు.