: టాటూ వేయించుకుంటే బర్గర్ ఉచితం... ఆస్ట్రేలియా సంస్థ ఆఫర్
వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని సంస్థలు వినూత్న ఆఫర్లు ప్రకటించడం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో 'కేఫ్ 51' అనే సంస్థ కూడా ఇటువంటి ఆఫర్ నే ప్రకటించడంతో కస్టమర్లు స్టోర్ ముందు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆఫర్ ఏమిటంటే, ఈ కేఫ్ 51 అందించే బర్గర్ల బొమ్మలను టాటూ రూపంలో ఒంటిపై వేయించుకోవాలి. అలాంటి వారికి ఈ సంస్థ జీవితాంతం రోజుకో బర్గర్ చొప్పున ఉచితంగా అందిస్తుంది. ఒంటిపై ఎంత సైజులో టాటూ వేయించుకుంటే అంత సైజు బర్గర్ నే అందిస్తుంది. ఈ ఆఫర్ వినడం ఆలస్యం, ఇదేదో బావుందే అనుకుంటూ కస్టమర్లు భారీగా స్టోర్ ముందు బారులు తీరారు.