: కేబినెట్ భద్రతావ్యవహారాల సంఘంతో భేటీ కానున్న ప్రధాని మోదీ... మరోవైపు రాజ్‌నాథ్ సమీక్ష
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మరికాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా వ్యవహారాల సంఘం సమావేశం కానుంది. సైనికాధికారుల నుంచి మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమాచారం తెలుసుకుంటున్నారు. మరోవైపు, అంతర్గత భద్రతపై రాజ్‌నాథ్ సింగ్ పలువురు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ అధికారులతో భేటీ కానున్నారు. అన్ని విభాగాలను సమన్వయ పరుచుకుంటూ, పరిస్థితులను ఎదుర్కునేందుకు రాజ్‌నాథ్ సింగ్ పలు సూచనలు చేయనున్నారు. ఇప్పటివరకు తాము తీసుకున్న చర్యలను రాజ్‌నాథ్‌కి ఆర్మీ అధికారులు వివరించనున్నట్లు సమాచారం.