: షారూక్ తర్వాత వచ్చిన వారెవ్వరూ ఆ స్థాయికి ఎదగలేదు: దర్శకుడు అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ బాద్ షా, సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తర్వాత చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారని, అయితే, వారెవవరూ ఆ స్థాయికి ఎదగలేకపోయారని దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నారు. ఇతర నటులతో పోల్చుకుంటూ వాళ్లలాగే చేయాలనే ఉద్దేశంతో చాలా మంది నటులు తమ కెరీర్ ఎక్కడ మొదలు పెట్టారో, అక్కడే ఉండిపోతున్నారని అన్నారు. నటన, స్టార్ డమ్ అనేవి వేరని, ఈ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఒకేసారి స్టార్ డమ్ సాధించాలనే తపనతో గొప్ప పాత్రల కోసం ఎదురు చూస్తుంటారని, చిన్న పాత్రలపై నిర్లక్ష్యంగా ఉండటమో లేక పట్టించుకోకపోవడం చేస్తుంటారని చెప్పారు. అయితే, షారూక్ ఖాన్ మాత్రం అలా కాదని, చిన్న పాత్రలు పోషిస్తూ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారని అనురాగ్ కశ్యప్ అభిప్రాయపడ్డారు.