: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది యాత్రికులు మృతి, 12 మందికి గాయాలు
హర్యానాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని భివాని జిల్లా సైనివాస్ గ్రామంలో ఓ వ్యానును ట్రక్కు ఢీ కొట్దింది. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ... వ్యానులో యాత్రికులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. ప్రమాదంలో బాధితులంతా పంజాబ్ కి చెందిన వారని పేర్కొన్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.