: నాడు అటల్ జీ చేయలేనిది, నేడు మోదీ జీ చేసిచూపించారు!


దేశ మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారి వాజ్ పేయి నాడు చేయలేని పనిని, ప్రధాని నరేంద్ర మోదీ తన హయాంలో చేసి చూపించారు. 2011లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ ఉగ్రవాదులు మన దేశంలో పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఏకంగా, మన దేశ పార్లమెంట్ పైనే దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి అనంతరం వాజ్ పేయి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించలేదని పలు విమర్శలు వచ్చాయి. ప్రస్తుత విషయానికొస్తే, యూరీ సెక్టార్ ఘటన, కాల్పుల విరమణ నిబంధనలను పాక్ ఉల్లంఘించడం వంటి కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నాయి. వ్యూహాత్మక సహనం పాటించిన భారత్, మొన్న అర్ధరాత్రి నియంత్రణ రేఖ వెలుపల ఉన్న ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను భారత్ సైన్యం మట్టుబెట్టడం తెలిసిన విషయమే. పాక్ దుశ్చర్యలకు తగు విధంగా బుద్ధి చెప్పే విషయంలో నాటి ప్రధాని అటల్ జీ చేయలేని పనిని, నేడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ చేసి చూపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా, వాజపేయి హయాంలోనే పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించడం, కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన విషయాన్ని మరవకూడదని మరికొంతమంది అంటున్నారు.

  • Loading...

More Telugu News