: హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రత


భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ఆర్మీ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్, ఏవోసీ గేట్ ప్రాంతాల్లో సైనికాధికారులు భద్రతను పెంచారు. ఆర్మీ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఆర్మీ పాస్ లేని వాహనాలను మరో మార్గంలో పంపిస్తున్నారు. ఇక రాత్రి సమయాల్లో అయితే ఎవరినీ అనుమతించడం లేదు. కాగా, హైదరాబాద్ లో రక్షణ రంగానికి చెందిన డీఆర్ డీఎల్, డీఆర్ డీఓ, మిధాని తదితర సంస్థలకు భద్రత పెంచారు. ఈ సంస్థలపై దాడులకు పాల్పడే అవకాశముందనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఆయా సంస్థలకు భద్రతను పెంచడం జరిగింది.

  • Loading...

More Telugu News