: వరలక్ష్మితో విశాల్ లవ్ బ్రేకప్?.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్!


నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి, నటుడు విశాల్ ఏడేళ్ల ప్రేమ బ్రేకప్ అయిందా? కోలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా తానేంటో నిరూపించుకున్న విశాల్, ప్రముఖ నటుడి కుమార్తెగానే కాక హీరోయిన్‌గా తనకంటూ పేరు సంపాదించుకున్న వరలక్ష్మి ఏడేళ్లుగా లవ్‌లో మునిగితేలుతున్నారు. ఈ విషయం జగద్వితం కూడా. తర్వలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కుతున్నట్టు వార్తలు కూడా వినిపించాయి. తమిళ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని విశాల్ ఇదివరకే ప్రకటించాడు కూడా. ఈ క్రమంలో తాజాగా వరలక్ష్మి ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు వీరి బంధంపై ప్రశ్నలు రేకెత్తేలా చేశాయి. కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల కాలంలో ప్రేమ పరిహాసంగా మారుతోందంటూ ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేసిన వరలక్ష్మి ఏడేళ్ల బంధాన్ని ఓ వ్యక్తి తేలిగ్గా తుంచేయాలనుకుంటున్నాడు అని పేర్కొంది. ఈ విషయాన్ని నేరుగా ఆ అమ్మాయికే చెప్పాశాడని పేర్కొంది. ‘‘ప్రేమంటే ఇంతేనా? ప్రపంచంలో ప్రేమ ఏమైపోతుందో? ఎక్కడుందో?’’ అంటూ ఆవేదనగా ప్రశ్నించింది. ఆమె ట్వీట్ విశాల్‌ను ఉద్దేశించి చేసినదేనని కోలీవుడ్ ఇప్పుడు కోడై కూస్తోంది. ఇటీవల జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్-శరత్‌కుమార్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాల్ తన ప్రేమకు బ్రేకప్ చెప్పి ఉంటాడని సినీవర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News