: బంజారాహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డు నంబరు 12లోని ఓ భవనం నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.