: సరిహద్దులో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. భారీగా మోహరించిన భారత సైన్యం


భారత దళాల సర్జికల్ స్ట్రయిక్స్ విషయం బయటకొచ్చిన తర్వాత భారత్-పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఉద్రిక్తతలు క్షణక్షణం పెరుగుతూనే ఉన్నాయి. ఏ క్షణాన్నైనా యుద్ధం జరిగే అవకాశమున్నట్టు వార్తలు వచ్చాయి. ఎదుర్కొనేందుకు ఇరు దేశాల సైన్యాలు అప్రమత్తంగా ఉన్నాయంటూ బ్రేకింగులు వచ్చాయి. ఇదిలా ఉంచితే ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ తన సరిహద్దు వెంబడి భారీగా దళాలను మోహరించింది. రంగంలోకి దిగిన ఎయిర్‌ఫోర్స్ విమానలు గస్తీ కాస్తున్నాయి. మరోవైపు సరిహద్దు భద్రతపై కేంద్ర కేబినెట్ కమిటీ నేడు భేటీకానుంది.

  • Loading...

More Telugu News