: నేటి నుంచి దసరా సెలవులు.. అక్టోబరు 13న పాఠశాలలు పున:ప్రారంభం


ప్రభుత్వం నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. శుక్రవారం నుంచి అక్టోబరు 12 వరకు తెలంగాణలో పాఠశాలలను మూసివేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జి.కిషన్ తెలిపారు. పాఠశాలలు తిరిగి వచ్చేనెల 13న పున:ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News