: యుద్ధం వస్తే.. అవసరం అయితే డ్యూటీలో జాయిన్ అవుతా... ఒక్క ప్రకటనతో హీరోగా మారిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!


తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి భారతీయుడి గుండెను హత్తుకునే ప్రకటన చేసి ఆకట్టుకున్నారు. 20 ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ కదనోత్సాహంతో ఉన్నారు. తన అంచనా ప్రకారం భారత్ కు ప్రస్తుతం కష్టకాలమని, యుద్ధం దేనికీ పరిష్కారం కాదని చెప్పారు. అయితే అస్థిర పాకిస్థాన్ తో యుద్ధం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని, పాకిస్థాన్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమని అన్నారు. దీంతో యుద్ధం వస్తుందనే అంచనా వేస్తున్నానని ఆయన తెలిపారు. యుద్ధం వస్తే... అవసరం అంటే ఏ క్షణమైనా విధుల్లో జాయిన్ అయ్యేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. దేశానికి సేవ చేయడం కంటే భాగ్యం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఏదీ మర్చిపోయానని అనుకోవద్దని, ఈ క్షణంలో అయినా విధుల్లో చేరేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. ఈ ప్రకటనతో ఆయన హీరోగా మారిపోయారు.

  • Loading...

More Telugu News