: పాకిస్థాన్ నటులు, టెక్నీషియన్లపై నిషేధం విధించిన ప్రొడ్యూసర్స్ అసోసియేషన్
పాకిస్థాన్ నటీనటులు, టెక్నీషియన్లపై నిషేధం విధించినట్టు అల్ ఇండియా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. తాజాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కు చెందిన అన్ని రకాల టెక్నీషియన్లపై నిషేధం విధిస్తున్నామని, ఈ నిషేధం తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటించింది. నిర్మాతలెవరూ పాకిస్థాన్ కు చెందిన కళాకారులతో కలిసి పని చేయరాదని ఆదేశించారు.