: మీరిద్దరూ ఇలా గొడవ పడడం మానకపోతే నేను నిరాహార దీక్షకు దిగుతా!: 'కావేరీ' వివాదంపై ఉమాభారతి హెచ్చరిక


కావేరీ జల వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సయోధ్య కుదుర్చుకోవాలని కేంద్ర మంత్రి ఉమాభారతి తెలిపారు. ఢిల్లీలో ఈ వివాదంపై ఆమె మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలు సయోధ్య కుదుర్చుకోని పక్షంలో ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. కావేరీ జలాల వివాదంపై రెండు రాష్ట్రాల అధికారులతో చర్చించిన సందర్భంగా న్యాయస్థానం బయటే సమస్యకు పరిష్కారం వెతకాలని సూచించారు. కావేరీ నదీ జలాల లభ్యతపై నిపుణులతో కమిటీ వేయాలని కర్ణాటక రాష్ట్రాన్ని ఆమె కోరారు. రెండు రాష్ట్రాలు సమస్యకు పరిష్కారం వెతుకుతున్నాయని న్యాయస్థానానికి చెబుతామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News