: ఇప్పటివరకు హైదరాబాద్ లో 700కు పైగా అక్రమకట్టడాలు కూల్చివేశాం: జీహెచ్ఎంసీ కమిషనర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను జీహెచ్ఎంసీ సమర్థవంతంగా నిర్వహిస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఈరోజు 290 అక్రమనిర్మాణాలు కూల్చివేసినట్లు, ఇప్పటివరకు మొత్తం 700 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపారు. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా తమ పని తాము సమర్థవంతంగా చేశామని చెప్పారు. నాలుగు రోజుల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు చెప్పారు. బాధితులు వాగ్వివాదానికి దిగుతున్న నేపథ్యంలో భవనాలు కూల్చివేస్తున్న ప్రాంతాల్లో భారీగా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ఈరోజు కూడా తాము ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను కూల్చివేయొద్దని పలుచోట్ల బాధితులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు.