: బ్రేకింగ్ న్యూస్... హైదరాబాదులోని ఎంఎస్ కాలేజీలో ఐసిస్ శిక్షణ
బ్రేకింగ్ న్యూస్... హైదరాబాదులో ఐఎస్ఐఎస్ శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాదులోని మలక్ పేటలోని ఎంఎస్ మైనారిటీ కళాశాలలో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న విషయం బట్టబయలైంది. కళాశాలలో లెక్చరర్ గా పని చేసే ప్రవీణ్ ఈ మధ్యే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్ ద్వారా హైదరాబాదులో ఐఎస్ఐఎస్ వేళ్లూనుకున్నట్టు పోలీసులు గుర్తించారు. లెక్చరర్ ప్రవీణ్ కుమార్ 'సేవ్ కంట్రీ' అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.